రొమాన్స్‌లో హీరో, హీరోయిన్ల‌నే మించిపోయిన ర‌ష్మి,సుధీర్‌

1298
Once again dance sudigali sudheer and rashmi in dhee program
Once again dance sudigali sudheer and rashmi in dhee program

బుల్లితెర మీద కూడా హాట్ పెయిర్ ఉంటార‌ని నిరుపించిన జంట ఎవ‌రైన ఉన్నారా అంటే అది సుడిగాలి సుధీర్‌, యాంక‌ర్ ర‌ష్మిలే అని చెప్పాలి. బుల్లితెర మీద మోస్ట్ సక్సెస్‌పుల్ జంట‌గా పేరుపొందిన వీరిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటు వార్త‌లు వచ్చాయి.

అలాంటిది ఏం లేద‌ని వీరు చెప్పినప్ప‌టికి, వీరిని మాత్రం రూమ‌ర్స్ వ‌ద‌ల‌డం లేదు. వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే చూడల‌ని ఉంద‌ని చాలామంది త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న ఢీ, జ‌బ‌ర్థ‌స్త్ షోల‌కి విప‌రీత‌మైన రేటింగ్స్ వ‌స్తోంది. దీంతో వీరిద్ద‌రితోనే ఎక్కువ ఎట్రాక్ట్ అయ్యే సీన్లు చేయిస్తున్నారు ఈటీవీ యాజ‌మాన్యం. తాజాగా వీరిద్ద‌రు ఢీ షోలో ఓ పాట‌కు డ్యాన్స్ వేశారు. సుధీర్ గ‌తంలో పాడిన పాట అడిగా..అడిగా సాంగ్‌కు ర‌ష్మి,సుధీర్‌లు క‌లిసి డ్యాన్స్ వేయడంతో స్టేజ్ మొత్తం ఈల‌ల‌తో ద‌ద్ద‌రిల్లింది.

ఇక ఎప్ప‌టిలాగే వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ అదిరిపోయింది. సుధీర్ మోకాళ్ల మీద కూర్చోని ర‌ష్మికి ప్ర‌పోజ్ చేయ‌డం ఈ సాంగ్‌కే హైలెట్‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. వీరిద్ద‌రు డ్యాన్స్ చేస్తోన్నంత సేపు జ‌డ్జీలు కూడా తెగ ఎంజాయ్ చేస్తు క‌నిపించారు. సుధీర్‌,ర‌ష్మి ఇలా డ్యాన్స్ వేయ‌డంపై సోష‌ల్ మీడియాలో ఇంకా ఎలాంటి వార్త‌లు వ‌స్తాయో చూడాలి.