Wednesday, April 24, 2024
- Advertisement -

అస్కార్‌కు ఎంపికైన ఇండియ‌న్ సినిమా

- Advertisement -

అస్కార్ అవార్డుకు ఇండియ‌న్ సినిమాలు నామినేట్ అవ్వ‌డ‌మే పెద్ద గొప్ప‌.అస్కార్‌కు నామినేట్ అయితేనే మ‌న‌వాళ్లు విన్న‌ర్‌లా ఫీల్ అవుతుంటారు.తాజాగా 91వ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఓ సినిమా నామినేట్ అయి సంచ‌ల‌నం సృష్టించింది. ‘విలేజ్ రాక్ స్టార్స్’ అనే సినిమాఅస్కార్ అవార్డుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ‘విలేజ్ రాక్ స్టార్స్’ ఆస్కార్ అవార్డుకి పోటీ పడుతోంది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శనివారం అనౌన్స్ చేసింది.ఈ అవార్డుల బరిలో భారత్ నుండి దాదాపు 28 సినిమాలు పోటీ పడ్డాయి.

వాటిలో ‘విలేజ్ రాక్ స్టార్స్’ తో పాటు ‘పద్మావత్’, ‘రాజీ’, ‘హిచ్ కీ’, ‘అక్టోబర్’ ఇలా చాల సినిమాలున్నాయి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరికి చెందిన పదేళ్ల అమ్మాయికి గిటార్ అంటే ఎంతో ఇష్టం. సొంతంగా బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ఆమె తనకు ఎదురైనా పరిస్థితులను ఎదుర్కొని రాక్ స్టార్ గా ఎలా ఎదిగిందనే డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు ఉత్తమ జాతీయ అవార్డు లభించింది.ఈ సినిమాకు అస్కార్ అవార్డు క‌నుక వ‌స్తే చ‌రిత్రే అని చెప్పుకోవాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -