Saturday, April 20, 2024
- Advertisement -

లిప్ లాక్‌ల‌తో రెచ్చిపోయిన బిగ్‌బాస్ న‌టి

- Advertisement -

త‌మిళ న‌టి ఓవియా బిగ్‌బాస్‌తో బాగానే ఫేమ‌స్ అయింది. త‌మిళ బిగ్‌బాస్‌ను ఓ ఊపు ఊపింది ఓవియా. త‌న‌తో పాటు కంటెస్టెంట్‌గా వ‌చ్చిన ఆర‌వ్‌తో ఎఫైర్ సాగించి సంచ‌ల‌నం సృష్టించింది. షో నుంచి ఎలిమినేట్ అయిన త‌రువాత అలాంటిది ఏమి లేద‌ని చెప్పి భ‌లే తప్పించుకుంది. బిగ్‌బాస్ ద్వారా పాపుల‌ర్ అయిన ఓవియా త‌మిళ సినిమాల‌లో బాగానే అవ‌కాశాలు చేజిక్కిచుకుంది.

తాజాగా ఈ భామ ’90ML’ అనే సినిమాలో న‌టిచింది. ఇటీవ‌లే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ట్రైల‌ర్ మొత్తం అడ‌ల్డ్ స‌న్నివేశాలే ఉన్నాయి. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి న‌టించింది ఓవియా. లిప్ లాక్‌ల‌తో కుర్ర‌కారుకు ఎర వేసింది. ట్రైల‌ర్‌లో కొన్ని బూతు ప‌దాలు కూడా ఉండ‌టం విశేషం. ఈ ట్రైల‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది ఓవియా. చూడండి.. పండు రుచి చూడబోతూ విత్తనం ఎలా ఉంటుందో నిర్ణ‌యించకండి.

సినిమా విడుదలయ్యే వరకు ఆగండి. అప్పటివరకు ట్రైలర్ ఎంజాయ్ చేయండి’ అంటూ పోస్ట్ పెట్టింది. దీనిని చూసిన నెటిజ‌న్లు ఓవియాని ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ వంటి ప్రొగ్రామ్‌లో న‌టించి అడల్ట్ సినిమా చేయడం ఏంటని వారు ఓవియాని ప్రశ్నిస్తున్నారు.మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు స్పూర్తిగా తీసుకుంటున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా’ అంటూ ఓవియాపై మండిపడుతున్నారు. ట్రైల‌ర్ చివ‌ర్లో త‌మిళ హీరో శింబు కూడా క‌నిపిస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -