Thursday, April 18, 2024
- Advertisement -

ఆ హీరో నా జీవితంలో ఉంటే బాగుంటుంది

- Advertisement -

త‌మిళ న‌టి ఓవియా బిగ్‌బాస్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయింది. బిగ్‌బాస్ త‌రువాత త‌మిళ సినిమాల‌లో అవకాశాలు బాగానే వ‌స్తున్నాయి. కొన్ని సినిమాల‌లో అయితే హీరోయిన్‌గా కూడా న‌టించింది ఈ భామ‌. తాజాగా ఈ భామ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు హీరో శింబుపై త‌న‌కున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది. శింబు నాకు మంచి స్నేహితుడు, అంత‌కు మించి ఏమి లేదు. ప్రేమ‌కు , స్నేహానికి చాలా తేడా ఉంద‌ని చెబుతోంది.

శింబుతో త‌న వ్య‌క్తిగ‌త విశేషాల‌ను కూడా షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని చెబుతోంది. ఏ టైంలోనైనా ఆయ‌న్‌కు ఫోన్ చేసే చ‌నువు ఆయ‌న‌తో నాకు ఉంద‌ని అంటోంది ఓవియా. ఆయ‌న నా క‌ష్ట సుఖాల‌ను అర్థం చేసుకుంటార‌ని తెలిపింది. శింబు నా జీవితంలోకి వ‌స్తే చాలా బాగుంట‌ద‌ని చెప్పి, అత‌నిపై ప్రేమ‌ను చెప్ప‌క‌నే చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -