పరన్నజీవి మూవీ రివ్యూ..!

835
parannageevi movie review and rating
parannageevi movie review and rating

రామ్ గోపాల్ వర్మ తీసిన పవర్ స్టార్ కు పోటీగా పరన్నజీవి ని తెరకెక్కించారు నూతన్ నాయుడు. శ్రేయాస్ ఈటీ యాప్‌లోని రిలీజైన పరాన్నజీవి చిత్రం ఎలా ఉందో తెలుసుకొందాం.

కథ : నా ఇష్టం అనే తరహాలో వెళ్తు ఉంటాడు డైరెక్టర్ రాధా గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి (షకలక శంకర్). వేషాలు ఎరగా వేసి వాళ్లను వాడుకుంటూ అన్యాయం చేస్తాడు వర్మ. ఇక్కడ ఓ యువతి మోసపోతుంది. ఇక వర్మతో సినిమా తీయాలనుకునే నిర్మాత శేకర్ (మహేష్ కత్తి)కి ఆర్జీవి షాకిస్తాడు. తాను ఊహించుకొన్న ఆర్జీవికి ఎదురుగా ఉండే వ్యక్తి నిజస్వరూపం చూసి దిగ్బ్రాంతికి గురవుతాడు. ఆర్జీవి చేసిన మోసానికి ఆ హీరోయిన్ ఏం చేసింది ? ఎలా పగ తీర్చుకుంది ? ఆర్జీవికి నిర్మాత శేఖర్ ఎలా బుద్ది చెప్పారు? తన అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి (లక్ష్మణ్ మీసాల) తన బాస్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పారు? అలాగే గత చిత్రాలు రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాల్లోని పాత్రలు కూడా ఆర్జీవికి ఎలా బుద్ది చెప్పారనే అనే ప్రశ్నలకు పరాన్నజీవి కథ సమాధానం.

విశ్లేషణ : రాధా గోపాల్ వర్మ (ఆర్జీవి) అమ్మాయిలపై, నీలిచిత్రాలపై, మద్యంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఎదుటివారిని చూసి భయంతో వణికిపోయే లక్షణం ఆయనను మానసిక బలహీనతకు కారణమవుతుంది. ఇలా వర్మ చేతిలో మోసపోయినవారు.. అలాగే ఇతరుల జీవితాలతో ఎలా ఆడుకుంటాడు.. నిర్మాతలను ఎలా వేధిస్తాడనే అంశాలతో సినిమా సాగుతోంది.

సెకాండాఫ్ లో వర్మకు ఎదురైన ప్రతికూల సంఘటనలు.. ఆయన చేతిలో మోసపోయిన వ్యక్తులు ఏకమై ఆర్జీవికి ఎలా బుద్ది చెప్పారు అనేవి అత్యంత సినిమాటిక్‌గా అనిపిస్తాయి. చివర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా మాకు విచక్షణ ఉంది. ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవడం మా నాయకుడు నేర్పించలేదు. మిమ్మల్ని ఏదైనా చేయాలంటే ఓ క్షణం పట్టదు. కానీ మా విధానం అది కాదు అంటూ సినిమా ముగుస్తుంది. ఇక ఎండ్ టైటిల్స్‌లో జనసేన అధినేత ఉద్దేశించి చిత్రకరించిన పాట ఫ్యాన్స్ కి ఉత్తేజాన్ని ఇస్తుంది. రాధా గోపాల్ వర్మ పాత్రకు తగినట్టుగా కథ రాసుకోవడంలో, కథనాన్ని అందించడంలో నూతన్ నాయుడు సఫలమయ్యాడు. పరాన్నజీవిని ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా సినిమానీ తీశాడు. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి.

ఇక శకలక శంకర్ ఆర్జీవిగా అదరగొట్టేశాడు. సరైన హావభావాలు పలికిస్తూ బాగా చేశాడు. ఇంకా కంటెంట్ నిడివి ఎక్కువగా ఉండి పాత్ర బలంగా ఉంటే ఆ పాత్రకు ఇంకా మంచి పేరు వచ్చేది. మ్యూజిక్, పాటలు బాగున్నాయి. సన్నివేశాలను చాలా రిచ్‌గా చిత్రకరించారు. ఎడిటింగ్ ఫర్వాలేదు. అక్కడక్కడా హడావిడిగా షూట్ చేశారనే అర్దం అవుతోంది. నైతిక విలువలకు తిలోదాలకు ఇచ్చిన ఓ గొప్ప దర్శకుడికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నంగా ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. కాకపోతే వ్యక్తిగతంగా, డైలాగ్స్, పాటలతో భారీగా టార్గెట్ చేయడం అభిమానులకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

మళ్లీ డాన్స్ తో కుర్రకారు మతిపోగిట్టిన ప్రగతి ఆంటీ..!

`పవర్ స్టార్` ట్రైలర్ రిలీజ్.. వర్మ టార్గెట్ మాములుగా చేయలేదు..!

నిఖిల్ ఎవరో నాకు తెలియదు : వర్మ షాకింగ్ కామెంట్స్

Loading...