Thursday, April 25, 2024
- Advertisement -

తాత ఎన్టీఆర్ ల‌క్ష‌ణాలే తార‌క్‌లో ఉన్నాయ్‌..

- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ప‌రుచూరి గోపాల‌కృష్ణ ప్ర‌శంస‌లు

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ త‌న కెరీర్‌లో జ‌రిగిన ముఖ్యమైన సంఘ‌ట‌న‌లు, మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న‌ల‌ను ‘పరుచూరి పలుకులు’తో ప్ర‌జ‌ల‌తో పంచుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావులాంటి మొండితనం యంగ్‌టైగ‌ర్‌, యన మనవడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యం చెప్ప‌డానికి ప‌లు ఘ‌ట‌న‌లు త‌న‌కు క‌నిపించాయ‌ని చెప్పారు.

‘వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా ‘ఆది’. ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తే ఇది బాల‌కృష్ణ డైలాగ్స్ అని త‌న కూతురు నాగ‌సుశ్మ అంద‌ట‌. నందమూరి తారాక రామారావు రక్తం అది, ఎవరు చెప్పినా పండుతుంది అని తాను బ‌దులిచ్చార‌ని చెప్పుకొచ్చారు.

ఇంకో స‌న్నివేశం కూడా చెప్పారు. విశాఖపట్నంలో క్లైమాక్స్‌ షూట్‌లో తారక్‌ చేతికి అద్దాలు గుచ్చుకుంటే ఇక షూటింగ్‌ ఆగిపోయింద‌ని అనుకున్నాను. కానీ చేతికి గాజ‌పు ముక్క‌లు అంటుకుని ఉన్నా సినిమా అలాగే చేస్తున్నార‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్పారు. ఆ ఘ‌ట‌న చూస్తే వెంటనే అన్న(సీనియ‌ర్ ఎన్టీఆర్‌) గుర్తొకొచ్చార‌ని తెలిపారు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అంతే ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్‌ ఆగిపోనివ్వరు. తాతగారి మొండితనం ఈ పిల్లాడికి వచ్చేసింది అనుకున్నట్లు పేర్కొన్న‌రు. ‘సర్దార్‌ పాపారాయుడు’ సినిమా క్లైమాక్స్‌లో అన్న చేతికి దెబ్బ తగిలింది.. కానీ ఆయన అలాగే కుడి చేతితోనే నటించారు. షూటింగ్‌ మాత్రం ఆగనివ్వలేదు’ అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

అనంతరం తారక్ త‌న‌ను పెద‌నాన్న అని పిలుస్తాడ‌ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గుర‌య్యారు. ‘ఆది’ సినిమా ఓ కార్య‌క్ర‌మంలో తారక్‌ నన్ను పక్కకు పిలిచి ‘మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా?’ అని అడిగాడు. నా కళ్లు చెమర్చాయి.. సరే అన్నాను. ఆ రోజు సమావేశం‌లో అందరికీ ‘నా పెదనాన్న’ అని చెప్పుకొచ్చాడు. అప్ప‌టి నుంచి ఇప్పటివరకు త‌న‌ను పెద‌నాన్న అని తార‌క్ పిలుస్తున్న‌ట్లు చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -