Friday, March 29, 2024
- Advertisement -

పవన్ బర్త్ డే రోజున సర్ ఫ్రైజ్ ఇదే.. ఫ్యాన్స్ కి పండగ..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ రెడీ చేశారు వకీల్ సాబ్ మూవీ యూనిట్. పవన్ బర్త్ డే రోజు సోషల్ మీడియాలో ఈ సర్ ప్రైజ్ సంచలనం సృష్టించబోతుందని తెలుస్తోంది.

పవన్ రీ- ఎంట్రీ మూవీ కాబట్టి చాలా గ్రాండ్‌గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత రెండేళ్ల పాటు రాజకీయల్లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్లీ కెమారా ముందుకు వచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు పవన్. అందులో మొదటిది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీ. ఇది బాలీవుడ్ లో మంచి హిట్ అయిన ’పింక్’ సినిమాకి రీమేక్. ఇక వకీల్ సాబ్ మూవీని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన వకీల్ సాభ్ ఫస్ట్ లుకు కు ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూట్ ఆగిపోయింది. అందుకే సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుక వకీల్ సాబ్ టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని వకీల్ సాబ్ యూనిట్ భావిస్తోంది. ఇక వకీల్ సాబ్ టీజర్ కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నీ బతుకెంత అని తిట్టావ్.. దేవుడున్నాడ్రా : అభిరామ్ శ్రీరెడ్డి ఫైర్

నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు : కస్తూరి

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

కుక్కలకు జవాబు చెప్పము : సునీత, ఝాన్సీ ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -