Tuesday, April 23, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని లెక్క చేయని ప్రభాస్ ఫ్యాన్స్..?

- Advertisement -

ఇండియా లో ఫ్యాన్స్ వార్ కొత్తేమి కాదు.. అలనాటి హీరోల దగ్గరినుంచి నేటి విజయ్ దేవరకొండ ఫాన్స్ వరకు హీరోల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు ఎదొక ఫ్యాన్స్ వార్ జరుగుతూనే ఉంటుంది.. ప్లేస్ మారొచ్చు కానీ వార్ జరగడం మాత్రం పక్క అన్నట్లు తయారైంది.. ఇప్పుడు ట్విట్టర్ లో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అందరి హీరోల ఫ్యాన్స్ కొట్టుకోవడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం.. హీరోల పుట్టిన రోజు వస్తే చాలు హైయెస్ట్ ట్రెండింగ్ మా హీరో దే అని చెప్పుకోవడంతో ఫాన్స్ కి ఉన్నంత ఉత్సాహం ఇంకా దేనిలోనూ ఉండదు..

తాజాగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ ల మధ్య ఇలాంటి ఒక ఆసక్తికరమైన వివాదం నడుస్తుంది. ప్రభాస్ కి ఇప్పుడు నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ ఉందన్నది వాస్తవం.. బాహుబలి సినిమా తో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. సాహో లాంటి సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా, ఉత్తరాదిన సూపర్ హిట్టయిందంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రభాస్ కి సినిమాల విషయంలో పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తామంటా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి నవ్వు తెప్పిస్తోందట.. మా హీరో లెవెల్ నేషనల్ స్థాయి లో ఉంది మాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదన్నది వారి వాదన.. వాస్తవానికి ప్రభాస్ కు పవన్ ఫ్యాన్స్ మద్దతిస్తే తప్పులేదు. అతడి సినిమాలకు మరింత మైలేజీ. ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. కానీ తమ హీరో మద్దతు లేకపోతే ప్రభాస్ సినిమాలు ఆడవు అనేంతలా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారు..ఏపీ లో బీజేపీ, జనసేన పొత్తు తో ఈ రకమైన వివాదం చర్చలోకి వచ్చింది.. మరి దీనిపై ఇరు హీరోలు ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి..

సమంత ఈ సినిమా లో విలన్ గా కనిపించనుందా..?

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

అల్లు అర్జున్ పుష్ప ప్లేస్ మారబోతుందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -