స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్…

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్సు చేసి అయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చినా తర్వాత సినిమాలు చేస్తాడో లేదో అని కొంత అనుమానం తో పాటు అసహనం కూడా వారిలో రోజు రోజు కి ఎక్కువవుతుంది.. ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కనీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలన్న కోరిక నెరవేరుతుంది అని ఫాన్స్ అంటున్నారు.. ఏదేమైనా అయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో నే ఉండాలనుకునేవారు ఎక్కువగా ఉన్నారు..

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. తొలిసారి పవన్ సినిమా కి సంగీతం వహిస్తున్నారు తమన్. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సొకిఒ ఫాంటసీ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఇందులో బందిపోటు గా కనిపించబోతున్నారని తెలుస్తుంది..

- Advertisement -

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఇక గబ్బర్ సింగ్ కాంబో వస్తున్న వస్తున్న పవన్ కళ్యాణ్ మూడో సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా కి హరీష్ శంకర్ దర్శకత్వంలో హైలైట్ అని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాతో పాటు దర్శకుడు డాలీ దర్శకత్వంలోనూ పవన్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పారట. ఈ రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021 మరియు 22 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ నుండి ఈ అయిదు సినిమాలు వస్తాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Most Popular

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్...

పవన్ కళ్యాణ్ మ్యానరిజం ని పొలిటికల్ ఫాన్స్ మిస్ అవుతున్నారట

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...