Friday, April 26, 2024
- Advertisement -

వార్తా పత్రిక మొదలు పెట్టనున్న పవన్?

- Advertisement -

1996 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన పవన్ కళ్యాణ్ కొద్దీ కాలం లొనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ట్రెండ్ ఫాలోవర్ కాదు ట్రెండ్ సెట్టర్ గా మారిపోయిన పవన కళ్యాణ్ పవర్ స్టార్ గా మారిపోయారు. ‘తొలి ప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యూత్ ఐకాన్ గా మారిన పవన్ కళ్యాణ్ కేవలం ఒక పేరు కాదు. పవనిజం అనేది ఒక కులం లా మారింది. ఒక హీరోగా కాకుండా ప్రేక్షకులు పవర్ స్టార్ ని ఒక దేవుడిగా కొలుస్తారు. ఎప్పుడూ ప్రజలకి ఎదో ఒకటి చేయాలని తపిస్తూ ఉండే పవన్ కళ్యాణ్ త్వరలో ఒక వార్త పత్రిక ని ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారట.

ఈ సందర్భంగా పవన్ తన సన్నిహితుల తో ఒక మీటింగ్ పెట్టనున్నారు అని తెలుస్తుంది. ఇటీవలే తన అభిమానులు పుట్టినరోజుని ఒక పండుగ లా జరుపుకుంటున్నారు. ఇప్పటికే అభిమానులు అందరూ పవన్ రాజకీయాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఆశిస్తుండగా, తనకి సొంతంగా ఒక వార్త పత్రిక ఉంటె అంతా సవ్యం గా సాగుతుంది అనే ఉదేశ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నారని, అలా జరిగితే జనాలకి తను చెప్పాలనుకున్నది నేరుగా చేరవేయొచ్చు అనే ఉదేశ్యం తో ఉన్నారట. ఈ విషయమై పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -