వకీల్ సాబ్ లో లాయర్ గా పవన్ ఎలా ఉంటాడో చూడండి..!

1080
pawan kalyans vakeel saab leaked pic goes viral
pawan kalyans vakeel saab leaked pic goes viral

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికి.. మళ్లీ సినిమాల్లో నటిస్తాను అని చెప్పడంతో.. దిల్ రాజు ఆయనకు పింక్ సినిమా కథను వినిపించారు. దాంతో పింక్ రీమేక్ లో నటించేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడంతో షూటింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ తో రీమేక్ అవుతుంది ఈ సినిమా.

ఈ సినిమాలో అక్కడ అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎం.సి.ఎ’ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ కనుక రాకుండా ఉండి ఉంటే.. మే నెలలోనే ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘వకీల్ సాబ్’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కీలక కోర్ట్ సన్నివేశం నుండి పవన్ కళ్యాణ్ పిక్ ఒకటి లీక్ అయ్యింది.

ఇలా లీక్ అయ్యిందో.. లేదో.. అలా వైరల్ అయింది. ఎంతో ఇంటెన్స్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పిక్ లో మనం హీరోయిన్ అంజలిని కూడా చూడొచ్చు. ఆమె కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పిక్ లో పవన్ కు ఎక్కువ గడ్డం లేదు. చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో అయితే పవన్ కళ్యాణ్.. ఎక్కువ గడ్డంతో ఉన్నాడు. మరి ఈ పిక్ ను బట్టి చూస్తుంటే.. ఇది క్లైమాక్స్ లో వచ్చే సీన్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది.

భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!

నిహారికను పెళ్లి చేసుకునేది ఇతనే.. ఎవరంటే ?

మూడో పెళ్లికి చేసుకుంటున్న ‘దేవి’ హీరోయిన్..!

సింగర్ సునీత కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..!

Loading...