Thursday, April 25, 2024
- Advertisement -

పాయల్ రాజపుట్ కి విజయశాంతి కి పోలికా?

- Advertisement -

పాయల్ రాజపుట్ ప్రస్తుతం ఆర్డీఎక్స్ అనే చిత్రం తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మీద మంచి బజ్ నడుస్తుంది. ఒకవైపు టీజర్ తో, మరో వైపు తో ట్రైలర్ తో ప్రేక్షకుల చూపు మొత్తం ఆకర్షించిన ఫిలిం యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతుంది. అయితే ఈ సినిమా లో ఇంటెన్స్ బోల్డ్ సీన్లు ఉండటం తో సినిమా కి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనే ఉదేశ్యం తో అందరూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శంకర్ భాను ఈ సినిమా కి దర్శకుడు.

అయితే ఈ సినిమా నిర్మాత ఇటీవలే మాట్లాడుతూ తన సినిమా హీరోయిన్ ని పొగడ్తల తో అమాంతం ఆకాశానికి ఎత్తేసాడు. అయితే పాయల్ ఒక డెడికేషన్ గల నటి అని, తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఎంతగానో అలరిస్తుంది అని ఆయన కొనియాడారు. అలాగే విజయశాంతి లో గల లక్షణాలు పాయల్ రాజపుట్ లో ఉన్నాయని, అలాగే విజయశాంతి లాగా పెద్ద నటి అవుతుంది అని కళ్యాణ్ చెప్పారు.

అయితే ఈ పోలిక చాలా వింతగా ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ ని పొగడాలి అంటే,ఏదో ఒక విధంగా పొగడచ్ఛు కానీ మరీ ఒక లెజండరీ హీరోయిన్ తో పోల్చడం ఏమి బాలేదు అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -