Thursday, April 25, 2024
- Advertisement -

బుల్ రెడ్డి ఐట‌మ్ సాంగ్ తో సెగ‌లు రేపుతున్న‌ పాయ‌ల్ రాజ్ పుత్‌..

- Advertisement -

బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న తాజా చిత్రం సీత. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల కానుంది.ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌ రిలీజ్ చేసిన సీత యూనిట్ తాజాగా సినిమాలోని మాస్ సాంగ్‌ను విడుదల చేశారు.

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన స్సెషల్‌ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనూప్‌ రుబెన్స్‌ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్‌, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. బుల్లెట్, యమహా, రాజ్ దూత్, ఇలా రకరకాల బైక్ పేర్లను ఈ సాంగ్ లో యూజ్ చేసి షూట్ చేశారు. ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -