Thursday, March 28, 2024
- Advertisement -

పిచోడు రివ్వూ

- Advertisement -

సమీక్ష : పిచోడు
విడుదల తేదీ : నవంబర్ 22, 2019
రేటింగ్ : 3/5
నటీనటులు : క్రాంతి , కె . సిమర్ , పోసాని కృష్ణ మురళి , సత్య కృష్ణ , సమీర్ , అభయ్ , మహేష్ , అప్పారావు తదితరులు
నిర్మాత , దర్శకత్వం : హేమంత్ శ్రీనివాస్
సంగీతం : బంటి
సినిమాటోగ్రఫీ : గోపి అమితాబ్
ఎడిటర్ : సంతోష్ గడ్డం

క్రాంతి , కె . సిమర్ జంటగా హేమంత్ శ్రీనివాస్ దర్శకనిర్మాణం లో తెరకెక్కిన చిత్రం “పిచ్చోడు” నేడు విడుదల అయ్యిoది. ట్రైలర్ తో వైవిధ్య కథాంశం గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఎలావుందో ఇప్పుడు చూద్దాం .

కథ : దేవుడు ప్రతి ఆత్మని రెండు భాగాలుగా చేసి ఒకదాన్ని ఒక అబ్బాయిలో మరొకదాన్ని అమ్మాయిలోనూ ఉంచి పుట్టిస్తాడు వాళ్లే సోల్ మెట్స్ అని నానమ్మ , తాతయ్య లు చెప్పిందాన్ని నమ్ముతాడు ఋషి . తన అమ్మానాన్నలు సోల్ మేట్స్ కాకపోవడంవల్లనే తన అమ్మ చనిపోయిందన్న నానమ్మ మాటలు బలంగా ముద్రించిపోయాయి .. ఇక అప్పటినుండి తన జీవితాశయం ఒక్కటే … తన సోల్ మెట్ ని వెతికి పట్టుకోవాలి . చివరికి ఋషి మరి తన సోల్ మేట్ ని వెతికి పట్టుకున్నాడా ? అసలు సోల్ మేట్ నిజమేనా అన్నవిషయాలు తెలుసుకోవాలంటే “పిచ్చోడు” సినిమా చూసి తీరాల్సిందే .

ప్లస్ పాయింట్స్ : ఈ మూవీకి ప్రధానబలం దర్శకుడు ఎంచుకున్న కథ, దాన్ని నడిపించిన విధానం . ఈ కథ నమ్మడానికి వీళ్ళెదనుకుంటాం కానీ నమ్మేలా సాగుతుంది.. చివరకు నిజమే అనిపిస్తుంది. ఒకదశలో ఒక థ్రిల్లర్ లా పరుగులు పెడుతుంది . కథకి పక్కదారులు వెతక్కుండా సూటిగాకథని చెప్పడం కూడా కొత్తగా అనిపిస్తుంది . సినిమా రెగ్గులర్ ఫార్మాటులో ఉండకుండా కొత్తఅనుభూతినిస్తుంది . నటీనటులు కొత్తవారుఅయినప్పటికీ తనవంతు ప్రయత్నం చేసారు . సహనటులు ఈ సినిమాకిప్రధాన బలం . ఇంట్రవెల్ ట్విస్ట్ బావుంది . చివరి అరగంట ఒక స్థాయిలో ఉంటుంది.. రీరికాడింగ్ సన్నివేశాలకి ప్రాణం పోసింది…

మైనస్ పాయింట్స్ : ఇంతమంచి చిత్రంలోనూ కొన్ని లోపాలున్నాయి ఒక్క పెద్దసినిమాస్టాయిలో గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ పరిమితులవల్లనో ఏమో కొన్నిచోట్ల సెట్ కాలేదనిపిస్తుంది. సినిమా ప్రారంభం ఒకరేంజ్లోఉన్నా ఫస్ట్ హాఫ్ మధ్యలో కాస్తనెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఒక పాట ఉంటె ఇంకా బావుండేది. ఎడిటింగ్ షార్ప్ గా ఉన్నప్పటికీ కొన్నిచోట్ల షాట్ కనెక్టివిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. దర్శకుడికి మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల బడ్జెట్ లోటు కనిపించింది.

సాంకేతికవిభాగం : సాంకేతికంగా ఉన్నతప్రమాణాలతో తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో ఒక లవ్ స్టోరీ ఇంత పకడ్బంధీ స్క్రీన్ ప్లే తో రాలేదు. దర్శకుడు హేమంత్ శ్రీనివాస్ రాసుకున్న కథలో ఉన్న దమ్ము నడిపించిన విధానంలోనూ కనిపించింది. ఆశ్చర్యపోయే విధంగా స్క్రీన్ ప్లే కుదిరింది. ఇంతమంచి రీ రికార్డింగ్ ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పొచ్చు. “మన పేర్లే వేరు పేర్ మాత్రం ఒక్కటే”, “లవర్ తో ఉంటూ రకుల్ ప్రీత్ ని ఊహించుకుని బ్రతికేవాళ్ళకన్నా నేను బెటరే ” లాంటి సంభాషణలు అలరిస్తాయి ఈ మూవీ చూశాక ఒక పరిణతి ఉన్న దర్శకుడు ఇండస్ట్రీకీ దొరికాడనిపిస్తుంది .

తీర్పు : మొత్తంగా చెప్పాలంటే “పిచ్చోడు” చిత్రం అనూహ్యమైన కథాంశంతో వచ్చిన ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆశ్చర్య పడేవిధంగా సాగె స్క్రీన్ ప్లే, నమ్మశక్యమైయ్యే సోల్ మేట్ కథాంశం ఈ సినిమాకి ప్రధాన బలం. “అందరు ఋషులు భక్తిలో ఋషులైతే ఈ ఋషి ప్రేమలో ఋషి అయ్యాడు” అన్న ఈ చిత్రంలోని డైలాగ్ ఈ సినిమా లోతుని చెప్తుంది. ఈ సినిమా చూసాక మీరు మీ సోల్ మెట్ గురించి ఆలోచిస్తారు. తల్లి దండ్రులు, పిల్లలు కలిసి చూడాల్సిన చక్కటి చిత్రం ఇది . గో ఫార్ ఇట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -