Friday, March 29, 2024
- Advertisement -

ఉర్రూతలూగిస్తున్న పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్

- Advertisement -

యువ హీరో శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ తో చేతులు కలిపి ‘రణరంగం’ అనే ఒక మాస్ యాక్షన్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించబోతున్న శర్వా ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రదర్శన్ లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పాట వీడియోను విడుదల చేశారు. శర్వానంద్ మరియు కాజల్ అగర్వాల్ ల మధ్య సాగే ఈ రొమాంటిక్ పాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

సన్నీ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు లాగా ఈ పాట కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఆ రోజు విడుదల కావాల్సిన ‘సాహో’ సినిమా వాయిదా పడటంతో ‘రణరంగం’ సినిమాకి సోలో రిలీజ్ లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -