పెళ్లి పేరుతో మోసం.. సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు పై సినీ నటి ఫిర్యాదు..!

1847
Police Case File Against Cinematographer Shyam K Naidu
Police Case File Against Cinematographer Shyam K Naidu

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు ఎన్నో సినిమాలకు పని చేశాడు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాలకు ఎక్కువగా వర్క్ చేశాడు. ఆయన పనితీరుపై దర్శకులు ప్రశంసలు కూడా చేశారు. అయితే తాజాగా శ్యామ్ కె నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.

విషయంలోకి వెళ్తే.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని సినీ నటి సాయి సుధ ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కే నాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక సాయి సుధా చాలా సినిమాల్లో నటించినప్పటికి అర్జున్ రెడ్డి సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. చిన్న సీన్ అయినప్పటికి జనాలకు బాగా గుర్తిండిపోయే సీన్ చేసింది.

Loading...