Saturday, April 20, 2024
- Advertisement -

అరెస్ట్ కాబోతున్న బిగ్ బాస్ భామ

- Advertisement -

తమిళం లో బిగ్ బాస్ లోని మూడవ సీజన్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ కూతురు మరియు ఒకప్పటి నటి అయిన వనిత విజయ్ కుమార్ కూడా ఒక కంటెస్టెంట్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఈమెను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని సమాచారం. గత కొంత కాలంగా ఒక ఇంటి విషయం వనిత తన తండ్రి విజయ్ కుమార్ తో గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. ఇది పక్కనపెడితే తాజాగా ఆమె భర్త తో విడిపోయిన వనిత కూతురి విషయంలో కూడా భర్త తో తగాదా పెట్టుకుందట.

2007లో ఆనంద్ రాజ్ ను పెళ్లి చేసుకున్న వనిత 2012లో అతనితో విడాకులు తీసుకుంది. కూతురు జోవిత సంరక్షణ బాధ్యత విషయంలో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతురిని దాచి పెట్టేసిందని ఆనందరావు తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వనిత పై కిడ్నాప్ కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. ఆమెను అరెస్ట్ చేయడానికి సహకరించాలని తమిళనాడు పోలీసులు మరియు బిగ్ బాస్ యాజమాన్యాన్ని తెలంగాణ పోలీసులు కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -