Saturday, April 20, 2024
- Advertisement -

బ‌న్ని – త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చాయి. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. వీరిద్ద‌రు క‌లిసి మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. తాజాగా వీరిద్ద‌రు చేయ‌బోయో సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, ర‌ష్మిక పేర్లు వినిపించిన‌ప్ప‌టికి వీరిని కాద‌ని మ‌రో హీరోయిన్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తోంది.

గ‌తంలో పూజా హెగ్డె బ‌న్నితో క‌లిసి దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. త్రివిక్ర‌మ్‌తో కూడా క‌లిసి ప‌ని చేసింది పూజా హెగ్డె. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌లో హీరోయిన్‌గా న‌టించింది ఈ భామ‌. ఈ సినిమాలో పూజా హెగ్డె న‌ట‌న‌కు మంచి పేరు కూడా వ‌చ్చింది. వీరు ముగ్గురు మ‌రోసారి క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. మొత్త‌నికి పూజా హెగ్డె మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది. ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌తో సినిమాలు చేస్తోంది పూజా హెగ్డె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -