Friday, April 19, 2024
- Advertisement -

పూజ కోరిక ని తీరుస్తున్న థమన్

- Advertisement -

ముకుంద సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో తెరంగేట్రం చేసిన భామ పూజ హెగ్డే. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమా చేసినా కానీ ఆశించిన స్థాయి లో విజయం సాధించలేకపోయింది. ఒక రెండేళ్లు గాప్ తీసుకొని హిందీ లో తన ఏడుస్తాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు కి తిరిగి వచ్చి బన్నీ సరసన దువ్వాడ జగన్నాధం అనే సినిమా లో నటించి మంచి పేరు సంపాదించి ఒకేసారి అగ్ర కథానాయికల లిస్ట్ లో కూడా చేరిపోయింది.

అయితే పూజ హెగ్డే కి యాక్టింగ్ తో పాటు సింగింగ్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా లో గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అయితే చాలా రోజుల నుంచి సింగర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పూజ భావిస్తుంది. ఇప్పుడు థమన్ పూజ కోరిక ని తీర్చనున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం లో బన్నీ హీరో గా వస్తున్న సినిమా లో పూజ హీరోయిన్. ఈ సినిమా కి థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా లో థమన్ పూజ తో ఒక పాట పాడించాలి అని నిర్ణయించుకున్నాడు అనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు దీని పై అధికారికంగా ఇంకా ఏ కన్ఫర్మేషన్ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -