పవన్ సినిమాలో పూజిత పొన్నాడ అలా..!

35888
Poojitha Ponnada shoots for a special song in Pawan Kalyan's next PSPK 27
Poojitha Ponnada shoots for a special song in Pawan Kalyan's next PSPK 27

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాలు మొదలు పెట్టారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక భారీ చారిత్రక సినిమాలో నటించబోతున్నాడు. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించారు. తాజాగా జాక్విలిన్ ను ఎంపిక చేశారనేది సమాచారం.

ఇక ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. ’కల్కి’, ’రంగస్థలం’ సినిమాలో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆకర్షణీయమైన ఆమె రూపానికి కుర్రకారు ఫిదా అయ్యారు. పవన్, క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటప్ సాంగ్ తో మరింత పాప్యులర్ అవ్వడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Loading...