Friday, March 29, 2024
- Advertisement -

బాలకృష్ణ మాటలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : పోసాని

- Advertisement -

లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దలు కొంత మంది చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సి.కళ్యాణ్.. ఇలా కొంత మంది సినిమా పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. తనని పిలవకపోవడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పెట్టుకుని భూములు పంచుకుంటున్నారా అంటూ మీడియా ముందు నోరు జారారు.

దీనిపై కొద్ది రోజులుగా తీవ్ర దుమారమే రేగుతోంది. బాలయ్యపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అవ్వడం, క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలపై తాజాగా నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. మీడియాతో మాట్లాడిన పోసాని..”బాలకృష్ణ తిట్టినా ఒక నిమిషమే. ఆవేశ పడినా ఒక నిమిషమే. కోపం పడినా ఒక నిమిషమే. విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి, బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్‌గా తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆయన కేవలం పదవి కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు.

నిజాయతీగా ఉంటారు. లంచగొండి కాదు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరూ ఆయన చుట్టుపక్కలకు రాలేదు. రామారావును అడ్వాంటేజ్‌గా తీసుకొని కొడుకులు సంపాదించలేదు. అప్పట్లో ఏ పేపర్‌లో రాలేదు. ఏ కాంగ్రెస్ వాళ్లు కూడా అనలేదు. ఎప్పుడూ అవినీతి అనే మాట లేని మనిషి బాలయ్య. ఆయనకి ఉన్నదల్లా నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు. ఎవ్వడికీ నష్టం కాదు. అంతా చాలా లైట్‌గా తీసుకుంటారు. నేనూ తీసుకుంటాను’’ అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -