Tuesday, April 23, 2024
- Advertisement -

శ్రీజ ప్రేమ విషయంలో చంద్రబాబు కుట్ర చేశాడు : పోసాని

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె లవ్, పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం అయిన విషయం తెలిసిందే. శిరీష్ భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని రోజులకు మనస్పర్దలు రావడంతో ఇద్దరు విడిపోయారు. తర్వాత శ్రీజ బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంది. అయితే తాజాగా వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి శ్రీజ ప్రేమ వ్యవహరంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

మాజీ సీఎం చంద్రబాబు కుట్ర కోణంపైనా కూపీ లాగుతూ మాట్లాడటం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రీజ లవ్ విషయంలో చంద్రబాబు పెద్ద కుట్ర చేశారని.. అతనొక దగాకోరు అని పోసాని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజల్లో చిరంజీవి తిరుగుతున్న టైంలో ఆ పార్టీని.. చిరంజీవిని ఉద్దేశించి నీచమైన కామెంట్స్ చేసినట్లు పోసాని గుర్తు చేశారు. “నిజం చెప్పండి చంద్రబాబు గారూ.. చిరంజీవి గారి అమ్మాయి పెళ్లి విషయంలో.. ప్రేమ విషయంలో మీరు కామెంట్ చేయలేదా ? ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ చేయలేని వాడు దేశాన్ని.. రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడని మీ నేతలతో పబ్లిక్ లో అనిపించలేదూ ?” అంటూ పోసాని చెప్పారు.

“నీ కుళ్ళు రాజకీయాల కోసం దిగజారి కామెంట్స్ చేయించలేదా ? రెండు మూడు నెలల పాటు మెగాస్టార్ టార్గెట్ గా అదే పనిలో లేవా నువ్వు ? ఒకవేళ నిజంగా నీవు అలా చేయకపోయి ఉంటే అవి తప్పుడు వ్యాఖ్యలు అని ఖండిచేవాడివి. కానీ ఖండించలేదు. ఎందుకంటే ఆ కామెంట్స్ నీ నోట రాకపోయినా.. నీ ఉద్దేశం అదే. నా ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. నా భార్య కూడా ఆడదేనని నువ్వు అన్నావా? చిరంజీవి సెన్సిటివ్ కాబట్టి అతన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావ్. ఇక నీ ఆటలు చెల్లవు. నీకు తగ్గ మొగుడు వచ్చాడు” అంటూ బాబుపై పోసాని ఫైర్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -