పవన్ రీఎంట్రీ రెడీ.. ఇక రికార్డులే రికార్డులు..!

555
power star pawan kalyan re entry with lusifer remake
power star pawan kalyan re entry with lusifer remake

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా సూపర్ హిట్ అవుతే కలెక్షన్స్ సునామి సృష్టించాల్సిందే. అయితే ప్రజలకు మంచి చేయాలని ఆయన రాజకీయాలోకి వెళ్లారు. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆయన సినిమాల్లో లేనప్పటికి అభిమానులు మాత్రం తగ్గాలేదు. ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ లక్షల్లో అభిమానులు వస్తారు. అయితే ఫ్యాన్స్ మళ్లీ పవన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

అయితే గత ఎన్నికలో జనసేన పార్టీ ఘోర పరాజయం చూసింది. దాంతో పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని భావించారు అభిమానులు. కానీ పవన్ మాత్రం రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారని. అది కూడా రామ్ చరణ్ నిర్మాణంలో సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీకి బాధ్యత వ్యవహరించిన చరణ్.. ఇప్పుడు బాబాయ్ రీఎంట్రీకి కూడా బాధ్యత తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ కోసమే చరణ్ లూసిఫర్ రీమేక్ హక్కులను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రం అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. లూసిఫర్ సినిమా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి సరిగ్గా సరిపోతుందని చరణ్ ఆ సినిమా హక్కులు కొన్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. ఏది ఏమైన పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తే కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయం.

Loading...