Thursday, April 25, 2024
- Advertisement -

మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ పవర్ స్టారేనట

- Advertisement -

మహేష్ బాబు.. తాజాగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇటివలే బెంగుళూరు వెళ్లి అక్కడ కూడా ప్రమోషన్ లో పాల్గొన్నాడు. మీరు అత్యంత అభిమానించే పవర్ స్టార్ నాకు మంచి మిత్రుడు అని అన్నాడు.

కన్నడ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తనకి మంచి మిత్రుడని పవర్ స్టార్ గురించి చెప్పి అక్కడి ఫ్యాన్స్ ని ఖుషీ చేసాడు మహేష్. మహేష్ బాబు హిట్ సినిమాలైన ఒక్కడు, దూకుడు వంటి చిత్రాల కన్నడ రీమేక్స్‌లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య సహజంగానే స్నేహం అనేది బలపడిందని చెబుతుంటాయి సినీవర్గాలు. ఇక మంచి స్క్రీప్ట్ దొరికితే.. కన్నడంలోనూ డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు మహేష్ తెలిపాడు.

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన స్పైడర్ మూవీ రిలీజ్ రెడీగా ఉంది. మురుగదాస్ డైరెక్ట్ లో వచ్చిన ఈ సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య నటించాడు. స్పైడర్ ప్రమోషన్ కోసం మహేష్ మొదట చెన్నై వెళ్లి.. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లాడు. ఈ సినిమా ద్వారా మహేష్ తమిల ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -