Friday, April 26, 2024
- Advertisement -

సాహో లో ప్రభాస్ డబల్ యాక్షనా?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమాపై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్టిన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ లో ప్రభాస్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించటం. తాజాగా విడుదలైన ‘బ్యాడ్ బాయ్’ పాటలో ప్రభాస్ మరియు జాక్వలిన్ అదరగొట్టారు. అయితే ఈ పాటలో లిరిక్స్ మరియు ప్రభాస్ లుక్స్ ప్లే బోయ్ తరహా పాత్ర లాగా అనిపిస్తున్నాయి.

కానీ మరోవైపు ప్రభాస్ మరియు శ్రద్ధాకపూర్ పాట లో ప్రభాస్ చాలా కామ్ గా స్మూత్ గా వున్నట్టు కనిపిస్తున్నాడు. ఇలా రెండు వేరియేషన్లు కనిపించటంతో ప్రభాస్ సినిమాలో డబల్ ఆక్షన్ ప్లే చేస్తున్నాడా అంటూ కొందరు సందేహిస్తున్నారు. కొందరేమో ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా మాత్రమేకాక ముంబై బ్యాంక్ నుంచి 2 వేల కోట్లు దొంగిలించిన దొంగ గా కూడా కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఏదేమైనా నిజానిజాలు తెలియాలంటే విడుదల తేదీ ఆగస్టు 30 వరకు ఎదురు చూడాల్సిందే. భారీ బడ్జెట్తో యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -