Friday, April 19, 2024
- Advertisement -

లండన్ లో అనుష్కని కలవనున్న ప్రభాస్

- Advertisement -

బాహుబలి వంటి భారీ విజయం అందుకున్న తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి మళ్ళీ పని చేస్తారు అని అందరూ అనుకున్నారు. అభిమానులు కూడా అనుష్క సాహో లో నటిస్తే బాగుంటుంది అని ఆశ పడ్డారు కానీ అది కుదరలేదు. కానీ మీడియా లో ఎప్పటికి అప్పుడు ప్రభాస్ అనుష్క జంట గురించి పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. అందులో కొత్తేమీ లేదు. ఈ నటులు ఇద్దరూ కూడా ఇప్పటికే చాలా సార్లు తమ మీద వచ్చిన రూమర్స్ ని ఖండించారు. చివరికి సైలెంట్ అయిపోయారు. అయితే ఇద్దరూ కలిసి పబ్లిక్ గా దర్శనం ఇచ్చి చాలా రోజులు అయిపొయింది. తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ ఇద్దరూ త్వరలో లండన్ లో కలవనున్నారట.

బాహుబలి సినిమా లండన్ లో ని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్క్రీన్ చేయనున్నారు. ఈ సినిమా సంగీత దర్శకుడు పూర్తి ఆర్కెస్ట్రా తో ప్రదర్శన కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ ఈవెంట్ అక్టోబర్ 18 న లండన్ లో జరగనుంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ కి సంబందించిన వ్యక్తులు ఈ విషయం ధృవీకరిస్తూ ఆ ఈవెంట్ కి రానా, ప్రభాస్, మరియు అనుష్క వస్తున్నారు అని ప్రకటించారు. సినిమా ప్రదర్శన అనంతరం ప్రస్నోత్తరాలు కూడా జరుగుతాయి అని తెలియజేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -