సాహో విడుదల సమయంలో ప్రభాస్ లండన్లో ఉండబోతున్నాడట

693
Prabhas Busy In Saaho Promotions
Prabhas Busy In Saaho Promotions

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ఇంకా కేవలం పది రోజులు కూడా సమయం లేకపోవడంతో చిత్ర బృందం తో పాటు నేపధ్యంలో ప్రభాస్ కూడా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22 పొద్దున ఉదయం ప్రభాస్ త్రివేండ్రం వెళ్లి అక్కడ మలయాళం మీడియా మరియు అభిమానులను కలవనున్నారు. రెండు రోజులు చెన్నై మరియు బెంగళూరులో ప్రమోషన్స్ లో బిజీగా ఉండే ప్రభాస్ 25న హైదరాబాదులో ప్రమోట్ చేయనున్నాడు.

ఆ తర్వాత మళ్ళీ సినిమా ప్రమోషన్స్ నేపద్యంలో దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నాడు ప్రభాస్. దుబాయ్ లో కూడా ఫార్స్ ఫిలింమ్స్ అనే బ్యానర్ సాహో సినిమాని విడుదల చేస్తోంది. అక్కడ ఒక రోజు ప్రమోషన్స్లో పాల్గొనబోయే ప్రభాస్ తరువాత యూఏఈ మరియు లండన్ లలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం 30వ తేదీన కూడా ప్రభాస్ లండన్ లోనే ఉండబోతున్నాడట. అంటే సినిమా విడుదలకు రోజు ప్రభాస్ అక్కడే ఉండబోతున్నాడు అన్నమాట. ప్రభాస్ మళ్ళీ తిరిగి ఇండియా కి ఎప్పుడు రాబోతున్నాడో ఇంకా తెలియాల్సి ఉంది.

Loading...