Friday, April 19, 2024
- Advertisement -

సాహో మన వాళ్ళ చేతిలో లేదు

- Advertisement -

ఈ ఏడాది రానున్న అనేక చలన చిత్రాల్లో అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రం సాహో. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే సారి ఈ సినిమా విడుదల కానుంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మాతలు ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు అంటే ఇది మాములు విషయం కాదు. అయితే సినిమా కి సంబందించిన అన్ని పనులు చకచకా సాగిపోతున్నాయి కానీ ఒక ప్రమోషన్స్ విషయం లో చిత్ర యూనిట్ ముందు నుండి వెనక బడి ఉంది. అయితే అభిమానులు ఎప్పటికప్పుడు తమ అసంతృప్తి ని వ్యక్తపరచడం, దానికి నిర్మాతలు కూడా సరిగా రెస్పాండ్ కాకపోవడం జరుగుతూ వస్తుంది.

నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ అసలు తెలుగు టీమ్ కానీ తెలుగు నిర్మాతల చేతిలో కానీ లేదట. ఈ సినిమా ని కొనుక్కున్న బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ని చూసుకుంటుంది. ముంబై లో ని వాళ్ళ ఆఫిస్ లో ఒక సపరేట్ పీఆర్ టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే మన తెలుగు పీఆర్వో కి కూడా సినిమా ఎంత వరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనే విషయాల మీద పూర్తి అవగాహన లేదు అనే వార్తలు హల్చల్ అవుతున్నాయి.

సాధారణం గా అభిమానులకి కచ్చితం గా ఏదో ఒక రూపం లో సినిమా గురించిన వివరాలు తెలుస్తాయి కానీ అదేంటో గాని ఈ సినిమా విషయం లో అసలు అలా జరగడం లేదు. టీజర్ విషయం లో కూడా నార్త్ లో విశేష స్పందన వచ్చినా సౌత్ లో అక్కడక్కడా నెగటివిటీ ఉంది. దీనికి కారణం ప్రమోషన్స్ డిసైన్ చేసిన తీరు. మన సౌత్ కి సంబందించిన నిర్ణయాలు కూడా మన చేతిలో ఉంచకపోతే సినిమా విడుదల ఆయె టైం కి ఇది పెద్ద తలనొప్పిగా కచ్చితం గా మారుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -