Friday, March 29, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి గుట్టువిప్పిన ప్రగతి ఉప్పలపాటి

- Advertisement -

ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ రాయాలంటే ముందుగా రాయాల్సింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే. ఎప్పుడో ‘బాహుబలి’ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని పెళ్లి వార్తలు మొదలయ్యాయి. కానీ ఇన్నేళ్లు అయిపోయినా ప్రభాస్ పెళ్లి గురించి వార్త రాలేదు. ‘బాహుబలి’ సినిమా పూర్తయ్యాక ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు. ఆ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కూడా కాబోతోంది. అయితే తాజాగా ప్రభాస్ కి చెల్లెలైన ప్రగతి ఉప్పలపాటి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అమెరికాలో సెటిల్ అయిన ఒక ప్రముఖ బిజినెస్ మాన్ కూతురితో ప్రభాస్ కి పెళ్లి సెటిల్ అయ్యింది అని అయితే తేదీ ఇంకా ఫిక్స్ అవ్వలేదని ప్రగతి రివీల్ చేశారు. గత కొంతకాలంగా ప్రభాస్ మరియు అనుష్క ప్రేమించుకుంటున్నారు అంటూ పుకార్లు బయటకు వచ్చాయి. ఇద్దరు స్టార్లు ఎప్పటికప్పుడు ఆ పుకార్లను కొట్టిపారేస్తూ వస్తున్నప్పటికి తాజాగా ప్రగతి ఉప్పలపాటి చేసిన కామెంట్లు ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టే సాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి మాత్రమే కాక ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -