Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ కోసం కామెడీ విలన్ రెడీ

- Advertisement -

సరిలేరు నీకెవరు సినిమా షూటింగ్ కి సంబంధించి మొదటి షెడ్యూల్ ని కాశ్మీర్ లో ముగించుకున్న దర్శక నిర్మాతలు. ఈ సినిమా లో ముందుగా జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తాడు అనే టాక్ నడిచింది కానీ తర్వాత ప్రకాష్ రాజ్ ని ఆ స్థానం లోకి తీసుకున్నారు సినిమా యూనిట్. అయితే జగపతి బాబు ఈ విషయమై క్లారిటీ ఇస్తూ తనకి సినిమా లో ముందుగా ఇచ్చిన పాత్ర చాలా నచ్చింది అని, ఇప్పటికి కూడా చేయడానికి సిద్దమే అని చెప్పారు.

ఆయితే చిత్ర వర్గాల సమాచారం మేరకు ఆ పాత్ర ఫుల్ లెన్త్ కామెడీ తో ఉండబోతుంది. ఈ సినిమా లో విలన్ పాత్ర ప్రకాష్ రాజ్ చేస్తున్నారు కానీ ఆ పాత్ర లో కామెడీ యాంగిల్ ఎక్కువ ఉందట. అందుకే జగపతి బాబు వదులుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. అనిల్ రావిపూడి తనదైన శైలి లో ఆ పాత్ర ని బాగా ఎంతెర్తైనింగ్ గా డిసైన్ చేశారు అని తెలిసింది. హైదరాబాద్ లో ఈ నెలాఖరున మొదలయ్యే రెండో షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ పాల్గొననున్నారు.

అనిల్ సుంకర మరియు దిల్ రాజు ఈ సినిమా ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -