పండగ చేసుకుంటున్న ప్రతిరోజు పండగే బయ్యర్లు, దిష్టిబ్యూటర్స్ !!!

493
Prati Roju Pandage turns highest grosser in Sai Dharam Tej and Maruthi's career
Prati Roju Pandage turns highest grosser in Sai Dharam Tej and Maruthi's career

యంగ్ మెగా హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రంతో బయ్యర్లు పండగ చేసుకుంటున్నారు. డీసెంట్ మౌత్ టాక్ తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. ఆరో రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే. బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. నిన్న ఒక్క రోజే దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఏడో రోజు కలెక్షన్స్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రానుంది. మరోవైపు యూఎస్ లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది. ఆరో రోజుతోనే $400K మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ ఫన్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు చూసుకుంటే ప్రతిరోజు పండగే 40 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సాయి తేజ్ కెరీర్ లో ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విశేషం.

Loading...