Saturday, April 20, 2024
- Advertisement -

‘ప్రేమ‌క‌థ చిత్ర‌మ్ – 2’ టీజ‌ర్‌

- Advertisement -

ప్రేమ‌క‌థ చిత్ర‌మ్ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికి తెలిసిందే. సుధీర్ బాబు, నందిత హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. మారుతి దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయింది. ప్రేమ క‌థ చిత్ర‌మ్‌-2 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నాడు. హరికిషన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. హారర్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా ఫేం నందిత శ్వేత న‌టిస్తుంది. సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -