Friday, April 19, 2024
- Advertisement -

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

- Advertisement -

‘కార్తీక దీపం’ సిరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ సోమావారం నుండి శనివారం వరకూ స్టార్ మాలో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది వంటలక్క. ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.

మలయాళం నటి అయినప్పటికి.. తెలుగు సీరియల్ కార్తిక దీపం ద్వారా లక్షలాది మంది ఫ్యాన్స్ ను సంపాధించుకుంది. సోషల్ మీడియాలో ఈమెకు విపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘డాక్టర్ బాబు.. వంటలక్క ఎప్పుడు కలుసుకుంటారా?’ అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంటారు నెటిజన్లు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వంటలక్క పాల్గొని పలు విషయాలు చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది. తెలుగులో తెరకెక్కుతోన్న ఓ లేడి ఓరియెంటెడ్‌ మూవీలో ప్రేమి విశ్వనాథ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట.

‘నేను నటినవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో యాదృశ్చికంగా జరిగిపోయింది. ఈరోజు నాకు ఇంత మంది అభిమానులున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నిజానికి కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికి నేను నటించిన ఓ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఉండేది. కరోనా కారణంగా ఆ సినిమా షూట్ వాయిదా పడింది’ అని చెప్పుకొచ్చింది ప్రేమి విశ్వనాథ్. మొత్తానికి బుల్లితెర పై నుండి వెండితెరపై ఇప్పుడూ వంటలక్క మెరవనుంది.

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

నాని తన సినిమా కి ఎందుకు ప్రొడ్యూసర్ ని మార్చాడు..?

జెనీలియా భర్త కదా అని అనేసరి నా ఈగో హర్ట్ అయ్యింది : రితేష్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -