Saturday, April 20, 2024
- Advertisement -

ఆ విష‌యంలో సన్నీలియోన్‌నే దాటేసింది

- Advertisement -

స‌న్నీలియోన్ బాలీవుడ్‌కే కాదు ఓవ‌రాల్ ఇండియాకే శృంగార దేవ‌త.అందాలు ఆరబోయడంలో స‌న్నీని మించిన వారు లేరు.పోర్న్‌స్టార్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన స‌న్నీ, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఆమె క్రేజ్ మారిపోయింది.హిందీతో పాటు తెలుగు,త‌మిళ భాష‌ల‌లో న‌టించి మంచి పాపుల‌రిటీ సంపాందించింది.అలాంటి సన్నిని ఒక్క క‌న్ను గీటుతో దాటేసింది ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌.గ‌త రెండు ,మూడు సంవ‌త్స‌రాల‌లో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా స‌న్నీలియోన్ నిలిచిన సంగ‌తి తెలిసిందే.

కాని ఈ సంవ‌త్స‌రం మాత్రం స‌న్నీని వెన‌క్కి నెట్టి మ‌రి రేసులోకి దూసుకొచ్చింది ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌.ఒరు అడార్ లవ్’ సినిమాలో ఒక పాటలో కన్నుకొడుతూ చక్కటి హావభావాలు కనబరిచిన ప్రియా వారియర్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.ఆ సినిమా విడుదల కాకుండానే ప్రియా వారియర్ కి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె పాపులారిటీ నార్త్ కి కూడా పాకింది. చాలా మంది తారలు ఆమెను పొగుడుతూ ట్వీట్లు పెట్టారు.రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు. మూడో స్థానంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -