Thursday, March 28, 2024
- Advertisement -

యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్న గువ్వ‌గోరింక పాట టీజ‌ర్

- Advertisement -

వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఓ సినిమా తీస్తోంది. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గువ్వ‌గోరింక. ఈ పాట టీజ‌ర్ ఒక‌టి విడుద‌లైంది. ఈ పాట టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంది.

సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య న‌టీన‌టుల‌తో రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక అని పేర్కొంటున్నారు.

విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ఈ ప్రేమకథను తీస్తున్నార‌ట‌. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రంగా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం ధీమా వ్య‌క్తం చేస్తోంది. అయితే సినిమాలో సోష‌ల్ మీడియా ఎలా ఉందో.. యువ‌త ఎలా బ‌ల‌వుతుందో చెబుతూ ఓ పాట ఉంది. ఈ పాట టీజ‌ర్ ఇప్పుడు విడుద‌ల‌య్యింది.

ఈ సినిమాకు మ్యూజిక్ సురేశ్ బొబ్బిలి అందిస్తున్నాడు. పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, మైల్స్ రంగస్వామి, కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -