Thursday, April 25, 2024
- Advertisement -

స్టార్ హీరోయిన్‌కు సెక్స్‌వ‌ల్ వేధింపులా…?

- Advertisement -

ఆ మ‌ధ్య సినిమా ఇండ‌స్ట్రీలో న‌టించే న‌టీమ‌ణుల గురించి కాస్టింగ్ కౌచ్ అనే ఉద్య‌మం న‌డిచిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అయితే దీనివ‌ల్ల ఎటువంటి లాభం లేకుండాపోయింది. సినిమా ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని ఎక్క‌డో ఓ చోట నిరుపితుమ‌వుతునే ఉంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సైతం ఈ లైంగిక వేధింపుల బాధ త‌ప్పలేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ప్రియాంక చోప్రా కూడా ఒక‌రు. మిస్ ఇండియా కిరీటం గెలిచిన త‌రువాత హీరోయిన్‌గా సినిమాల్లో న‌టిస్తు రాణిస్తుంది. తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు…త‌నని సెక్సువల్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చింది.

యాంక‌ర్ మీరు ‘ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?’ అని ప్రియాంక‌ను ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మాధానంగా ఎస్ ఫేస్ చేశాన‌ని చెప్పుకొచ్చింది. తనను ఎవరు వేధించారు..? ఎప్పుడు వేధించారనే విషయాలపై మాట్లాడడానికి ప్రియాంక ఇష్టపడలేదు. ఇక ప్రియాంక వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ చిత్రాలకంటే హాలీవుడ్ లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతోంది ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ తో కలిసి అమెరికాలో జీవిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -