Saturday, April 20, 2024
- Advertisement -

ప‌బ్లిక్‌గా ముద్దుల‌తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త‌న వైవాహిక జీవితాన్ని హాయిగా గ‌డుపుతోంది. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ను గ‌త ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌రువాత మ‌రింత హాట్‌గా క‌నిపిస్తోంది ప్రియాంక‌. పెళ్లి త‌రువాత ఇండియాలో క‌న్నా లండ‌న్‌లోనే ఎక్కువుగా ఉంటుంది. ఇద్ద‌రు క‌లిసి లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. తాజాగా ఈ హాట్ క‌పూల్ ప‌బ్లిక్ ప్లేస్‌లో ముద్దుల‌తో రెచ్చిపోయారు. వీరిద్ద‌రు క‌లిసి బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు వచ్చారు.

ఈ ఈవెంట్‌లో జోనస్ బ్రదర్స్ బిల్ బోర్డ్ వేదికపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నిక్ స్టేజీ దిగి త‌న భార్య ప్రియాంక వద్ద‌కు వ‌చ్చి ముద్దు ఇచ్చాడు. త‌మ మ‌ధ్య బంధం ఎంత బ‌లంగా ఉందో ఈ ముద్దుతో చెప్ప‌క‌నే చెప్పారు ఈ జంట‌. ప్ర‌స్తుతం ఈ జంట ముద్దు పెట్టుకున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వేడుక‌లో నిక్ జోన‌స్ ఫ్యామిలీ మొత్తం ఆడి పాడింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ నటి సోఫీ టర్నర్ తదితరులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -