Thursday, March 28, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తి అయిందా..?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాపై వ‌చ్చినన్ని వార్త‌లు మ‌రో హరోయిన్‌పై రాలేదు. ఆమె ప్ర‌మేయం లేకుండానే నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది ఈ భామ‌. కొంత‌కాలం క్రితం ప్రియాంక త‌న పెళ్లితో వార్త‌ల్లో నిలిచింది. వ‌య‌స్సులో త‌న‌క‌న్నా చిన్నవాడు అయిన అమెరికన్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్ ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకుంది ప్రియాంక‌. అయితే ఆమె ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని వార్త‌లు వ‌స్తున్నాయి. అదేంటి డిసెంబ‌ర్‌లోనే క‌దా అప్పుడు గ‌ర్భ‌వతి అయిందా అంటూ చాలామంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే హీరోయిన్స్ పెళ్లి అవ్వ‌గానే తల్లులుగా మార‌డానికి ఇష్ట‌ప‌డురు.కాని ప్రియాంక అప్పుడే త‌ల్లిగా ఎలా మారుతుంద‌ని వారు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే మ‌రికొంతమంది ఆమె పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తి అయి ఉంటుంది. అందుకే అంత హ‌డావిడిగా పెళ్లి చేసుకుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సాక్ష్యం కూడా చూపిస్తున్నారు.

స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న భ‌ర‌త్ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట ప్రియాంక చోప్రానే తీసుకున్నారు. కాని ఆమె సినిమా నుంచి త‌ప్పుకుని మ‌రి నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. సల్మాన్‌తో సినిమా పూర్తి చేసిన త‌రువాత ప్రియాంక పెళ్లి చేసుకోవచ్చు క‌దా ,కాని ఆమె అప్పటికే గ‌ర్భ‌వ‌తి కావ‌డంతోనే అంత హ‌డావిడిగా పెళ్లి చేసుకుంద‌ని అంటున్నారు. ప్రియాంక గ‌ర్భ‌వతి అయింద‌నే వార్త‌ల‌పై స్పందించారు ఆమె త‌ల్లి మధు చోప్రా. ప్రియాంక చోప్రా తల్లిగారైన మధు చోప్రా ఈ వార్తల్ని ఖండించారు. ప్రియాంక ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంది. అందుచేత‌నే ఆమె కాస్తా బొద్దుగా మారింది. ఈ మాత్ర‌నికే గ‌ర్భ‌వతి అయింద‌ని ఎలా చెబుతారని మీడియాను ప్ర‌శ్నించింది మధు చోప్రా. ఒకవేళ గర్భిణి అయితే సంతోషమే కదా.. అంటూ మధు చోప్రా వివరణ ఇచ్చారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం వైల్డ్ వైల్డ్ కంట్రీ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -