Friday, April 26, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా అప్పుడే విడాకుల‌కు రెడీ అవుతోందా…?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2018 చివ‌ర్లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక‌. త‌న క‌న్నా వ‌య‌స్సులో చిన్న‌వాడు అయిన నిక్‌ను పెళ్లాడింది ప్రియాంక‌. పెళ్లి జ‌రిగిన ద‌గ్గ‌ర నుంచి ప్రియాంక‌పై అనేక వార్త‌లు వచ్చాయి, వ‌స్తున్నాయి. ప్రియాంక పెళ్లి అయిన వెంట‌నే హానీమూన్ గురించి వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత ఆమె ఇండియాను వ‌దిలేసి అమెరిక‌లో సెటిల్ అవుతుంద‌ని వార్తలు పుట్టుకొచ్చాయి. మ‌రి కొంత‌కాలానికి ప్రియాంక గ‌ర్భ‌వ‌తి అయిందంటూ వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై ప్రియాంక చోప్రా అమ్మాగారు వివర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రియాంక చోప్రా విడాకుల‌కు రెడీ అయింద‌టూ బాలీవుడ్ మీడియాలో ఓ వార్త ప్ర‌చురించింది. భర్త నిక్ నుంచి విడిపోవాడినికి ప్రియాంక చోప్రా రెడీ అయిందని ఈ వార్త‌ల సారాంశం. నిక్‌తో ప్రియాంక‌కు ప‌డటం లేద‌ట‌, నిత్యం ఏదో ఒక విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయాట‌. దీంతో భ‌ర్త నుంచి విడాకులు తీసుకోవాల‌ని ప్రియాంక చోప్రా భావిస్తుంద‌ని బాలీవుడ్ మీడియా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ వార్తలు విన్న ప్రియాంక, నిక్ అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఈ వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -