Friday, March 29, 2024
- Advertisement -

రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు..!

- Advertisement -

దిల్ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా చెప్పాడు దిల్ రాజు. ’ప్రస్తుత పరిస్థితులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. ప్రొఫెషనల్‌గానూ ఆటంకాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి కోలుకోవడానికి నాకు టైం రాలేదు. అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. నా జీవితంలో కూడా వ్యక్తిగత సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నాను. అందుకు అనుగుణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను.. అందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నా’ అంటూ పెళ్లి వార్తను దృవీకరించారు దిల్ రాజు.

ఇక నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం, 20 మంది కుటుంబీకులు, స్నేహితుల మధ్య గత రాత్రి నిరాడంబరంగా జరిగింది. ఇక, దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అని తెలుస్తోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని ఆయన పెళ్లాడారు. యూఎస్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఈమె, ఎయిర్ హోస్టెస్ గానూ పని చేసినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకున్న దిల్ రాజుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు.

దిల్ రాజు మొదటి భార్య 2017లో మరణించిన సంగతి తెలిసిందే. ఆపై తన తండ్రికి మరో వివాహం జరిపించాలని ఆయన కుమార్తె హన్షిత పట్టుదలగా ప్రయత్నించింది. దీంతో దిల్ రాజు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహం జరిగింది. 2014లోనే హన్షిత రెడ్డికి వివాహం కాగా.. 2017లో తన తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి తన తండ్రికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారట హన్షిత రెడ్డి. తన తండ్రికి బాగా తెలిసిన అమ్మాయే తనకు తల్లిగా వస్తుండటంతో ఈ పెళ్లి తన చేతుల మీదుగానే జరిపించిందట దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -