Saturday, April 20, 2024
- Advertisement -

Rx100 హీరో కి కొత్త చిక్కులు

- Advertisement -

Rx100 సినిమా విజయం సాధించిన తర్వాత ఆ సినిమా హీరో కార్తికేయ ఆ సక్సెస్ ని నిలుపుకోలేకపోయాడు. తన రెండో సినిమా హిప్పీ తో పెద్ద పరాజయం చవిచూశాడు. ఇప్పుడు ఈ హీరో గుణ 369 మరియు 90 ML అనే సినిమా లో పని చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా బాగా ఉపయోగపడతాయి అనే ధీమా తో ఉన్నాడు కార్తికేయ. అయితే ఇప్పుడు తను పని చేస్తున్న ఒక సినిమా తో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది.

90 ML అనే సినిమా ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. జయ జానకి నాయక సినిమా ని నిర్మించిన ఈయన ఇప్పుడు ఈ సినిమా ని మధ్యలో నే వదిలేసినట్లు తెలుస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అని, అందుకే ఇక తను డబ్బులు పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితి లో కార్తికేయ సోదరుడు సినిమా నిర్మాణాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు అని వినికిడి.

ప్రస్తుతం గుణ 369 నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉండగా, 90 ML మాత్రం ఇంకా విడుదల కి నోచుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -