Tuesday, March 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో సినిమా..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందుకే జోరు పెంచారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ’పింక్’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో మరో పీరియడ్ ఫిలిం కూడా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాదు అభిమానుల కోసం మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.

మాస్ ఎంటర్టైనర్ల కు కేరాఫ్ అడ్రెస్ అయిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషలో మరో సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని.. యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఈ సినిమాను అతి త్వరలో లాంచ్ చేస్తారని సమాచారం. ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసిన తీరు ఇప్పటికీ చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఈ సారి పవన్ కళ్యాణ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. పవన్ రీ-ఎంట్రీ తర్వాత సైన్ చేసిన సినిమాల్లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -