Saturday, April 20, 2024
- Advertisement -

సర్వం కోల్పోయే వాడే.. కాని సేవయ్యాడు

- Advertisement -

నేటి రోజుల్లో సినిమాను తీయడం గొప్పకాదు. దానిని రిలీజ్ చేయడం కష్టం. ఇది తెలియక ఎంతోమంది నిర్మాతలు, అప్ కమింగ్ ప్రొడ్యూసర్లు ఫీల్డ్ లోకి దిగి చేతు చమురు వదిలించు కుంటున్నారు. చాలామంది ఫైనాన్స్ తీసుకుని మూవీ పూర్తి చేసినా.. రిలీజ్ కు ముందు రోజున ఫైనాన్షియర్ల నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోవడానికి పడుతున్న కష్టాలు చూస్తే చాలా బాదేస్తుంది. ఇదే సమస్య పీఎస్వీ గరుడవేగ మూవీ కోసం రాజశేఖర్ కూడా ఫేస్ చేశాడని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం పెద్ద మొత్తమే వెచ్చించి సినిమాను నిర్మించగా…. డిస్ట్రిబ్యూషన్ వరకూ సమస్యలు రాలేదు. బట్ ….. కోస్తాలో సురేష్ మూవీస్.. సీడెడ్ లో సాయి కొర్రపాటి.. నైజాంలో మార్కాపురం శివకుమార్ రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూషన్ కి ప్రాబ్లెం లేదు. కానీ చివరకు విడుదల చేసేందుకు 3 కోట్ల రూపాయల ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి రావడం… అవి దొరక్కపోవడంతో రాజశేఖర్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం చివరకు హైదరాబాద్ లోని మంచి ఏరియాలోని తనకున్న 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడట. ఇన్ని చేశాక మూవీ ఫలితం మరోలా ఉంటే మ్యాటర్ మరోలా ఉండేది. తాజాగా సినిమాకు మంచి టాక్ రావడం….. శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మకుండా ఉండడం .. సినిమాకు ససర్వత్రా మంచి కలెక్షన్స్ కంటిన్యూ అవుతుండడంతో.. అతి త్వరలోనే తన ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నేడు రాజశేఖర్ ఇంతటి హ్యాపీగా ఉండటం వెనుక మరో రీజన్… అన్ని వర్గాల నుంచి రాజశేఖర్ పై సానుభూతి పవనాలు వీచడం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -