Thursday, April 18, 2024
- Advertisement -

యోగాతో ఫ్యాన్స్ కి పిచ్చేక్కిస్తున్న పునర్నవి..!

- Advertisement -

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎవరు కూడా కూడా బయటకు.. వెళ్లడం లేదు. కాదని బయటకు వస్తే పోలీస్ లు పచ్చడి చేసి తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. నిత్యవసర అవసరాలకు తప్పిస్తే మరేదానికి పోలీసులు అనమతించడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. సినిమా షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో ఖాళీగానే గడుపుతున్నారు. ఎలాగూ విదేశాలకు వెళ్ళే ఛాన్స్ లేదు.

అక్కడ పరిస్ధితి ఇంకా ఘోరంగా ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. అయితే నటీనటులు ఎవరైనా… మినిమం ఫిట్నెస్ మెయిన్టైన్ చెయ్యడం ఈ రోజుల్లో తప్పనిసరి. అందుకే కొందరు సెలబ్రిటీలు ఇంట్లోనే వర్కౌట్లు ఎలా చేసుకోవచ్చు అనేదాని పై వీడియోలు చేస్తూ వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి కూడా వచ్చి చేరింది. ఇంట్లోనే ఉంటూ రకరకాల యోగాసనాలు వేస్తూ ఈ సమ్మర్ లో మరింత హీట్ ఎక్కించే ప్రయత్నం చేస్తుంది.

ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం అవి వైరల్ గా మారిపోవడం కూడా జరిగింది. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈమె ‘బిగ్ బాస్3’ తో మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్నన్ని రోజులు సింగర్ మరియు బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్ తో క్లోజ్ గా ఉండటం వంటివి ఈమె క్రేజ్ ను మరింత పెంచిందని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -