పబ్ లో పునర్నవి.. రచ్చ రచ్చ చేసింది..!

592
punarnavi bhupalam hot pics goes viral
punarnavi bhupalam hot pics goes viral

బిగ్ బాస్ మూడో సీజన్ లో తెగ సందండి చేసింది పునర్నవి. రాహుల్, పునర్నవిల మధ్య మంచి రొమాంటిక్ ఎపిసోడ్ లు చాలానే నడిచాయి. పునర్నవి ఎలిమినేట్ అయినప్పుడు కూడా రాహుల్ ఏడ్చాడు. ఇక ఎలిమినేట్ అయిన తర్వత బయటకు వచ్చి తెగ ఎంజాయ్ చేస్తోంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడి అలవాటైనా పునర్నవికి.. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి.. ఎన్ని రోజులకు ఇంగ్లీష్ లో మాట్లాడే ఛాన్స్ వచ్చిందని సంతోషపడుతోంది.

ఒకే ఇంట్లో ఉండి బాధైన.. కోపమైనా వాళ్లపైనే చూపించి.. పంజరంలో చిక్కుకున్న చిలుకలాగా ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చి విహరిస్తూ ఉంది. బిగ్ బాస్ ప్రపంచం నుంచి కోలుకున్న తర్వాత లైవ్ లోకి వస్తాను అని చెప్పి.. ఒక్క రోజు తర్వాత లైవ్ లోకి వచ్చి అభిమానులను పలకరించింది. ఎన్నో విషయాలను వారితో షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తన పాత ఫ్రెండ్స్ ను కలిసి ఫుల్ జోష్ లో ఉంది.

తాజాగా పునర్నవి.. పబ్ కు వెళ్లి రచ్చ రచ్చ చేసిందట. ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. పబ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఈ వారం అందరు నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో క్రింద కామెంట్ చేయండి..!

Loading...