Friday, April 19, 2024
- Advertisement -

తన లవర్ గురించి చెప్పిన పునర్నవి..!

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ ద్వారా బాగా హైలైట్ అయింది ఎవరంటే వెంటనే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల పేర్లు చెబుతారు. వీరిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ గా ఉండటం.. హగ్స్, కిస్ లు వంటి వీరి మధ్య జరగడంతో వీళ్ల మధ్య ప్రేమ ఉందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే రకరకల వార్తలు వచ్చాయి. అయితే వీరి కోసమే బిగ్ బాస్ చూసిన వారు కూడా ఉన్నారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారా అని పలువురు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని వీరిద్దరు తేల్చేశారు.

అయితే పునర్నవితో డేటింగ్ గురించి అడిగాను కానీ.. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అది తప్పు అని తెలిపాడు రాహుల్. ఇక ఈ నెపథ్యంలో పునర్నవి ఇటీవలే ఓ షోలో పాల్గొని తన భాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలియని నిజాలను చెప్పి షాక్ ఇచ్చింది. పునర్నవి తన లవర్ గురించి చెబుతూ… “నన్ను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో లేడు.. చనిపోయాడు. తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్.నన్ను చాలా ఇష్టపడ్డాడు. కెరీర్లో సెటిల్ కాకుండా పెళ్ళి వద్దనే ఉద్దేశంతో నేను అతన్ని దూరం పెట్టాను. తరువాత ఎవరి మా కెరీర్ పనుల్లో మేము బిజీ అయిపోయి పట్టించుకోలేదు. మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయి.. అదే సమయంలో తాను అమెరికాకు వెళ్ళాను.. నేను వచ్చేసరికి ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో అతను చనిపోయాడు.

అతను నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి. మనిషి ఉన్నపుడు విలువ తెలీదు.. అతను నాకో జ్ఞాపకంగా మిగిలిపోయాడు. అతను లేడనేసరికి కుంగిపోయాను. అదే సమయంలో ‘బిగ్ బాస్’ ఆఫర్ రావడంతో జీవితంలో మార్పు ఉంటుందని భావించి ఒప్పుకున్నాను” అంటూ అసలు విషయంను చెప్పింది. ఈ రకంగా చూస్తే పునర్నవి జీవితంలో ప్రస్తుతం ఎవరు లేరు. మరి రాహుల్ తో క్లోజ్ గా ఉంటుంది కాబట్టి రాహుల్ ను పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -