గ్లామర్ డాల్ కథ ఈ వారానికే కంచికి చేరుతుందా ?

1001
Punarnavi or Mahesh Who is Going To be Elimineted In This week
Punarnavi or Mahesh Who is Going To be Elimineted In This week

బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ ప్రజల ఓట్లతోనే జరుగుతుంది అనడం మాట వరుసకే. హిమజ బయటకి వచ్చాక చెప్పిన మాటలే దీన్ని బలపరుస్తున్నాయి. మహేష్ కంటే తననే ఇంట్లో ఉంచేందుకు బిగ్ బాస్ ఆర్గనైజర్లు ప్రయత్నించారని కానీ దానికి తను ఒప్పుకోలేదని హిమజ కరాకండీగా తేల్చిచెప్పేసింది. అప్పుడే బయట ప్రపంచానికి బిగ్ బాస్ యాజమాన్యం గురించిన అనుమానాలన్నీ పటాపంచలయిపోయాయి. అంటే జనాలు ఓట్లు వేసే దాని మీదే కాదు బిగ్ బాస్ ఎవరు ఉంటే రేటింగ్ బాగుంటది అనుకుంటే వారిని సేవ్ చేస్తారు.

రాహుల్, పున్నుల మధ్య ఏం లేకపోయినా పులిహోరా అంటూ వచ్చిన హైప్ ని పోనివ్వకుండా కాపాడుకుంటున్నారు వారిద్దరూ. రాహుల్ ఎలిమినేట్ అయ్యి కూడా వెనక్కి వచ్చేసాడు.. మళ్ళీ ఈ వారం నామినేషన్స్ లో పున్ను, రాహుల్ ఇద్దరూ ఉన్నారు. వారితో పాటు వరుణ్, మహేష్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వరుణ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, రాహుల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది, ఇంక మిగిలింది పున్ను, మహేష్… మహేష్ ని బిగ్ బాస్ యాజమాన్యం టార్గెట్ చేసింది అని హిమజ చెప్పింది కాబట్టి మహేష్ వెళ్ళిపోవచ్చు, కానీ ఈ సారి మహేష్ ఎలిమినేట్ అయితే దాని వెనక ఇంకో కారణం పున్ను గ్లామర్. ఎందుకంటే ముందు నుండి పున్ను ని సేవ్ చెయ్యడానికి తన ఉంటే షోలో కాస్త గ్లామర్ ఉంటుంది అనే కూడా ఒక కారణం.

Loading...