ఏ జోడీని వదలని ఈటీవీ రాహుల్, పునర్నవిని వదులుతుందా ?

7615
Punarnavi Rahul Got Good Chance From ETV
Punarnavi Rahul Got Good Chance From ETV

టీవీ ఛానళ్ళలో విడివిడిగా ఎంత చేసినా రాని క్రేజ్ జంటగా ఉంటే మాత్రం చాలు వెంటనే వచ్చేస్తుంది. అలా జోడీలుగా ఫేమస్ అయిన వారు మనకు ఢీ జోడిలోనో, ఢీ జూనియర్స్ లోనో కనిపించడం కామన్. అలా వచ్చిన వారే లాస్య-రవి, సుధీర్-రష్మీ. జోడీ ఎక్కడ మొదలైనా చివరకి వచ్చి ఆగేది మాత్రం ఢీ జోడీలోనే. ఈటీవి అలా చాలా జోడీలకే మంచి జీవితాన్ని ఇచ్చింది.

ఇప్పుడు రీసెంట్ గా పాపులర్ అయిన పునర్నవి-రాహుల్ జోడీని చాలామంది ఇష్టపడుతున్నారు. మొన్నటిదాకా అంటే పున్ను ఎలిమినేట్ అయ్యేవరకు వారికోసం బిగ్ బాస్ ను ఫాలో అయినవారు ఉన్నారు. చిలిపి అలకలతో, చిన్న చిన్న గిల్లికజ్జాలతో, తిట్టుకునేంత చునువుతో వారు బాగా కలిసిపోయారు. మొదట్లో ప్రేక్షకులకు తప్పుగా కన్వే అవుతుంది అనుకొని దూరంగా ఉన్న పునర్నవి తరువాత దాన్ని పట్టించుకోకుండా రాహుల్ తో చాలా క్లోజ్ అయిపోయింది. ఒకానొక టైమ్ లో అందరినీ పక్కకి పెట్టి రాహుల్ తోనే ఉండిపోయింది. రీసెంట్ గా పున్ను ఎలిమినేట్ అయిన రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు రాహుల్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుకోడుతుంది. బిగ్ బాస్ ఇంట్లో కోపం చూపించిన పున్ను బయటకి వచ్చాక రాహుల్ కోసం, రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడం కోసం కాంపైన్ చేస్తుంది అంటేనే అర్ధం అవుతుంది వీరి ఫ్రెండ్ షిప్.

ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే జోడిగా బాగా పాపులర్ అయిన రాహుల్-పునర్నవిల మీద ఇప్పుడు ఢీ యాజమాన్యం కన్నుపడింది అంట. బిగ్ బాస్ ఫైనల్స్ అవ్వగానే వీరిద్దరితో అగ్రిమెంట్ చేసుకోడానికి ఈటీవీ వారు వైయిట్ చేస్తున్నారంట. కానీ సింగర్ గా పాపులర్ ఉన్న రాహుల్, US వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న పునర్నవి దీనికి ఒప్పుకుంటారా అనేది చూడాలి. కానీ బిగ్ బాస్ తరువాత వీరి అభిమానులు వీరి కెమిస్ట్రీని మిస్ అవకుండా ఉండాలంటే మాత్రం రాహుల్ పున్ను ఈ అవకాశం అందుకోవడమే మంచిది.

Loading...