Friday, April 26, 2024
- Advertisement -

చిరంజీవి ట్వీట్.. పూరిని కొట్టిన అతని భార్య..!

- Advertisement -

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరుకి అందరు సెలబ్రిటీలు స్వాగతం చెప్పారు. వారిలో పూరి జగన్నాధ్ కూడా ఉన్నాడు. అయితే పూరి ట్వీటికి చిరంజీవి రిప్లై ఇచ్చాడు. దాంతో పూరి సమస్యలో ఇరుక్కున్నాడు. పూరి తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

అందరితో పాటు పూరి కూడా సోషల్ మీడియాకు గ్రాండ్ వెల్కమ్ చిరు సర్ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి చిరంజీవి స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. అందరి ట్వీట్స్ కి సాధారణంగా స్పందించిన చిరు్.. పూరి ట్వీట్ కి మాత్రం అసాధారణ రిప్లై ఇచ్చారు. కరోనా కర్ఫ్యూ లో ఉన్న పూరి.. ముంబై, బ్యాంకాక్ బీచ్ లను బాగా మిస్సవుతున్నావు. ఐతే నీ పిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు బాగా సంతోషిస్తూ ఉండి ఉంటారు అన్నారు.

ఎప్పుడూ బీచ్ లు పట్టుకు తిరిగే పూరి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నాడు అనే అర్థం వచ్చేలా చిరంజీవి ట్వీట్ ఉంది. దీనితో ఆ ట్వీట్ చదివేటప్పుడు పక్కనే ఉన్న భార్య లావణ్య పూరి చెంప పగుల కొట్టిందట. చిరు ట్వీట్ వలన తన గత చర్యలు గుర్తు చేసుకొని భార్య కోప్పడి కొట్టింది అని పూరి కొంచెం ఆసక్తికరంగా స్పందించారు. పూరికి బీచ్ లంటే మహా ఇష్టం, తను బ్యాంకాక్ బీచెస్ లో కూర్చిన 15రోజుల్లో స్క్రిప్ట్ రాసుకొని ఇండియా వస్తాను అని అనేక సార్లు చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -