Tuesday, April 16, 2024
- Advertisement -

బ్లాక్ బస్టర్ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎవరితో?

- Advertisement -

ఒకప్పుడు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పేరు మారు మ్రోగుతూ ఉండేది. కానీ వరుసగా డిజాస్టర్ లు అందుకున్న పూరీ జగన్నాథ్ పేరు చాలా మంది తీసిపారేశారు. ఎట్టకేలకు పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ ని అందించారు. దీంతో పూరి జగన్నాధ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు అని అభిమానులు సైతం ఆనందిస్తున్నారు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఇంకా పూరితో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇంకా పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా ని ఫైనలైజ్ చేయలేదు.

ఒకవైపు ‘పైసా వసూల్’ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ మళ్లీ బాలకృష్ణ ని హీరోగా పెట్టి సినిమా తీయాలని పూరి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలతో బాగా బిజీ అయిపోయాడు. మరోవైపు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ తీయాలని ప్లాన్ ఉంది కానీ దాని కోసం స్క్రిప్ట్ ఓకే అవలేదు. మరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయడానికి ఏ హీరో ముందుకు వస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -